|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:01 PM
వంగూర్ మండల కేంద్రం ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి మంజూరైన రూ 5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శుక్రవారం కల్వకుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ దేశినేని పండిత్ రావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదగిరిరావు, మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, మల్లేష్, యాదయ్య, గఫూర్, సైదులు, జంపులశ్రీనువాసులు, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.