|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:35 PM
అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షానికి పెద్దపల్లి మండలంలో వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన విషయం తెలిసిందే.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ అధికారులతో గ్రామగ్రామాన సర్వే చేయించి తక్షణమే పరిహారం చెల్లించేలా చూడాలని కోరారు.