![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 12:39 PM
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. స్పీకర్ కార్యదర్శి తరఫున వాదనలను అభిషేక్ మను సింఘ్వీ ప్రారంభించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని ఆయన తెలిపారు. తమ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి అని సింఘ్వీని కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత… ఆ పార్టీ తరఫున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు… కండువా మార్చేశారు. గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు 10 మంది ఎమ్మెల్యేలు. మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. చివరగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వీళ్ళ అందరిపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది గులాబీ పార్టీ.