![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:59 PM
సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది.పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి∙వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, నలుగురు విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లలిత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రహస్యంగా సంవత్సర కాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది.దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు లలితతోపాటు విటులు జనగామకు చెందిన బంతిని అశోక్, బుక్క కరుణాకర్, ఘన్‌పూర్ మండలం మీదికొండకు చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపా రు. వీరి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు.