![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 07:20 PM
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి.పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.