![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:19 PM
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. శ్రీరామనవమి తర్వాత మరో శుభవార్త వింటారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శ్రీరామనవమి తరువాత నుంచి చేపడతామని తెలిపారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ఇందిరమ్మ పాలనలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.