![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 07:27 PM
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా.. వ్యవసాయ రంగం మాత్రం దీన స్థితిలో ఉందంటూ ఆరోపించారు. ఇప్పటివరకు పంటలకు బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రశ్నించినవారిని బెదిరించడం, కేసులు పెట్టడటం తప్ప కాంగ్రెస్ నాయకులకు వేరే ఏమి తెలియదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.