తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 10:10 AM
జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఒక పాలసీని రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యా కమిషన్, విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని ఆయన అన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యావిధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలా ఈ పాలసీ ఉండాలని అన్నారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు.