|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 10:07 AM
ఆంధ్ర లో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.