![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:42 PM
బీసీ రిజర్వేషన్లపై దమ్ముంటే పీఎం మోడీని ఒప్పించాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు భయపడుతూ బీసీ ధర్నాకు మొహం చాటారని ఆరోపించారు.
బండి సంజయ్ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేశారని, ఒంటరిగా పోటీ చేయలేక బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారని అన్నారు. సొంతపార్టీ నేతలు కూడా బండి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.