![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 08:22 PM
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్,కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అంతేకాకుండా ఎండ ఎక్కువ ఉన్న సమయాల్లో చిన్న పిల్లలు, వ్రుద్దులు బయటకు వెళ్లకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.