![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 08:18 PM
తల్లాడ మండలం బసవపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాపా సుధాకర్, గుర్రం శ్రీను, నరసింహారావు, రవి, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.