![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:36 PM
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు.పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావాజాలంతో ఉన్నట్లు అనిపించారు. చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారింది. పూర్తీగా లెఫ్ట్ నుంచి రైట్ కు వచ్చారు. బీజేపీ పక్కన చేరిననాటి నుంచి హిందూత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది. ఆయన చేసే ప్రకటనలను కూడా ఒకదానికొకటి సంబంధం ఉండవు.