![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 07:42 PM
మోండా డివిజన్ లోని పెరుమాళ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 40 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభాభిషేకం శుక్రవారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణతో ఎంతో వైభవంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ నర్సారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆకుల హరికృష్ణ, నాగులు, రాములు, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.