![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 07:41 PM
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిస్టాపూర్ గ్రామానికి చెందిన ఉమర్ అలీ (27) అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు పక్కా సమాచారంతో మేడ్చల్ మండలంలోని రావాల్కల్ గ్రామ కమాను వద్ద టీవీఎస్ అపాచీ బైక్ పై వెళుతున్న నిందితుడిని ఎక్సైజ్ సీఐ నవనీత ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 1. 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.