|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 12:27 PM
రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం ఖమ్మం జడ్పీ సెంటర్ నందు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని పునరుద్ఘాటించారు. ఆయన ఆశయాలు సదా ఆచరణీయమైనవని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఉన్నారు.