|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:49 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట,టంగుటూరుతో పాటు పలు గ్రామాలలో కురిసిన ఆకాల వర్షాల వల్ల వరి పంటలు,మామిడి,సపోటా తోటలను,కూలిన ఇళ్లను సందర్శించి నష్టపోయిన రైతులను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు , యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి ఫోన్ చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.సంబంధిత అధికారులకు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంటను,తోటలను నష్టం అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు. కౌలు తీసుకుని వ్యవసాయం చేసిన రైతులు కన్నీరు మున్నీరవుతుంటే బీర్ల అయిలయ్య గారు ఓదార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.