|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:41 PM
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.ఈ క్రమంలోనే నేడు వణస్థలిపరంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించడం ప్రారంభించారు. ఉదయాన్నే వణస్థలిపురంలోని ఇంజాపూర్‌లో జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను అధికారులు కూల్చిశారు.పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్లను ఆక్రమించి ఈ కట్టడాలను నిర్మిస్తున్నట్టు గుర్తించారు. కూల్చివేతల సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో వారిని నచ్చబెప్పే ప్రయత్నం చేశారు. ఇక గతంలోనూ ఇదే తరహాలో హైడ్రా కూల్చివేతలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు తరచూ కూల్చివేతలు జరపగా ప్రస్తుతం హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తోంది. పూర్తిగా నిర్మించిన భవనాలను కాకుండా ప్రస్తుతం నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.