|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:32 PM
తెలంగాణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమయింది. ఈ నెల 22న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. 22వ తేదీ ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి