|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:46 PM
రఘునాథపాలెం మండలం మంచుకొండలో సింజెంట విత్తనాల కంపెనీ ఆధ్వర్యంలో నూతన రైతు బజార్ నిర్మాణానికి శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కూరగాయలు పండించుకునే రైతులకు లాభం చేకూర్చేలా మూడు నెలల్లో రైతు బజార్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఖమ్మం నుంచి తాజా కూరగాయలు మంచుకొండ రైతుబజార్ కు వచ్చి కొనుక్కునేలా పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. జెడ్పీ సీఈవో దీక్షారైనా తదితరులు ఉన్నారు.