|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 02:59 PM
దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ అయిన వాహనాలను ఈనెల 22న వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంలో పాల్గొనేవారు అదే రోజు ఉదయం 10 గంటలలోపు నాలుగు చక్రాల వాహనాలకు 30 వేలు, ద్విచక్ర వాహనాలకు 10 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని, వేలంలో వాహనాలు దక్కని వారికి తిరిగి డిపాజిట్ చెల్లిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.