|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:26 PM
భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. భూభారతి చట్టం- 2025 పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా.
బుధవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎలాంటి అన్యాయాలకు, అవకతవకులకు తావు లేకుండా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.