|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:24 PM
కాశ్మీర్ లోని పహల్గం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి పిరికిపందల చర్యగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ అభివర్ణించారు. బుధవారం నారాయణపేట పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పర్యాటకులపై ఉగ్రదాడిని పార్టీ పట్టణ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మత పిచ్చితో 26 మంది టూరిస్ట్ లను హతమార్చడం తగదని అన్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కాల్చి చంపడం సరైంది కాదని అన్నారు.