|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 05:38 PM
ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను పర్యటకులు వీడుతున్నారు. శ్రీనగర్ నుంచి విమాన ప్రయాణికులు సురక్షితంగా తిరిగి వెళ్లేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
అందుబాటు ధరల్లోనే టికెట్లను ఉంచాలని పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు 20 విమానాల్లో దాదాపు 3,337 మంది ప్రయాణికులు తిరుగు ప్రయాణమైనట్లు మంత్రి వెల్లడించారు.