|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 12:30 PM
మోత్కూరు పట్టణానికి చెందిన మాజీ ఎంపిటిసి ముద్దం జయశ్రీ మనవడు హిమాన్సు కుమార్ను మొదటి పుట్టినరోజు స్థానిక జి.ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరై హిమాన్సు కుమార్ను (చిన్నారున్ని) ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుని తల్లిదండ్రులు ముద్ధం విజయలక్ష్మి- లెనిన్ కుమార్, డి.సి.సి ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు అవిశెట్టి ఆవిలిమల్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండగాని రామచంద్రు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ పేలాపూడి వెంకటేశ్వర్లు, మాది ఎంపిటిసి కురిమిళ్ళ ప్రమీల, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలినేని ఆనందమ్మ, స్వామి రాయుడు, మెంట నాగేష్, చింత సోమ నర్సమ్మ, బండారు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.