|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 12:36 PM
కాశ్మీర్ లోని పహల్గాంలో యాత్రి కులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యండి. జహంగీర్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి, వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన యావత్ ప్రజల్ని కలచివేసిందని ఇది హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించడం ద్వారా కాశ్మీర్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకొని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి చర్యలు పునవృత్తం కాకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.