|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 01:51 PM
భార్యపై భర్త కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఆదిలాబాద్(D) గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తి, మారుతి భార్యాభర్తలు కాగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కీర్తి తన పుట్టింటి రాగా 4 రోజులు క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పటి నుంచి మారుతి కూడా అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఇవాళ ఉదయం తాగునీరు తెస్తానని బయటకు వెళ్లిన కీర్తిపై కత్తి దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది.