|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:27 PM
బడికి టాటా. సెలవులకు బాట. పాఠశాలలకు నేడు గురువారం నుండి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 12 కు పాఠశాలలను ప్రభుత్వం పునః ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు ఆటవిడుపు కలిగింది. బుధవారం లాస్ట్ వర్కింగ్ డే సందర్భంగా పాఠశాలకు హాజరైన విద్యార్థులు ప్రగతి పత్రాలు తీసుకుని ఆనంద ఉత్సవాలతో ఇండ్లకు వెళ్లారు. దీంతో బడి గంట మూగపోయింది.