|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:32 PM
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను సీఎం రేవంత్ తీవ్రంగా ఖండించారు. పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశంలో ఉగ్రవాదుల దాడులపై సీఎం స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర, కోమటిరెడ్డి, జూపల్లి, సీతక్క, పొంగులేటి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రతినిధులు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు.