|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:39 PM
రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. గురువారం నియోజకవర్గంలోని మార్చాల, పంజుగుల, ముకురాల గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.