|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:41 PM
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి-2025 అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 40 లక్షల మంది రైతుల ధరణిలో రిజిస్టర్ చేసుకున్న భూములకు సమస్యలు ఏర్పడ్డాయన్నారు. మన భూమికి రికార్డులు, గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. భూభారతి రైతులకు న్యాయం చేస్తుందన్నారు.