|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:31 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన హింసాఖండకు నిరసనగా బంద్ కు పిలుపునివ్వడంతో పట్టణ వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేశారు.
పట్టణంలోని ప్రధాన కూడలిల వద్ద మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ పిలుపుమేరకు స్వచందంగా బంద్ పాటించి సంఘీభావం తెలిపి ఉదయం నుంచి తమ తమ షాప్ లు స్వచ్చందంగా బంద్ చేశారు .