|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:37 PM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బకు మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో, 3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి చెందినట్లు లెక్కలు చెపుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి చెందినట్లు సమాచారం. రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.