|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:44 PM
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుల పిల్లలకు క్రీడా పోటీల్లో శిక్షణకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తెలిపారు. బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు బెల్లంపల్లి.
రామకృష్ణపూర్, మందమర్రి, సోమగూడెంలకు చెందిన పీఈటీలు ఈనెల 28న సాయంత్రం ఐదు లోపు జిఎం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25 రోజుల శిక్షణకు గౌరవవేతనం అందిస్తున్నట్లు వెల్లడించారు.