|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 11:13 AM
తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ఏర్పాటు సాధనే లక్ష్యంగా కేసీఆర్ చూపిన పోరాట పఠిమ మరువరానిదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టినా. 16 నెలల పాలనలోనే వ్యతిరేకత పెరిగిందన్నారు.