|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 11:45 AM
వరంగల్ ఉద్యమ చరిత్ర:అదే వేదిక..అదే ఉద్యమ స్పూర్తి...తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది వరంగల్ జైత్రయాత్ర . 22 ఏళ్ల తరువాత మరో చారిత్రక ఘట్టానికి హన్మకొండ వేదిక అవుతోంది.2003 ఏప్రిల్ 27న హన్మకొండ పట్టణంలో జరిగిన టీఆర్‌ఎస్ రెండవ వార్షికోత్సవ సభ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..మాజీ ప్రధాని దేవగౌడ,కేంద్ర మంత్రి అజిత్‌సింగ్, విదర్భ,బుందేల్‌ఖండ్ ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమ నాయకులు పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ సభలో జ్వాలల్లా ఎగసిన ఉద్యమం,నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కుల పట్ల అర్పించిన నిబద్ధత,తెలంగాణ ప్రజల గుండెల్లో నిప్పులా ఎగిసిపడింది. సిద్దిపేట నుండి కేసీఆర్ గారు సైకిల్‌పై ర్యాలీగా గ్రామాలను కలుపుకుని హన్మకొండ చేరి,వేలాదిమంది నాయకులతో లక్షలాదిగా తరలివచ్చిన ప్రజాశక్తి తెలంగాణ ఉద్యమ శక్తికి అంతర్జాతీయంగా మద్దతునిచ్చింది..
నాటి వరంగల్ జైత్రయాత్ర ఒక ఉద్యమ ఉరుముగా మారి కేసీఆర్ గారు ఉద్ఘాటించిన జైత్ర నాదమే నేటి తెలంగాణ సాధనకు నాంది పలికింది.ఇప్పుడు 2025 సంవత్సరంలో,అదే తేదీ, అదే స్థలం మరోసారి చరిత్రను గుర్తుచేస్తోంది.మనది రజతోత్సవ సభ మాత్రమే కాదు ఉద్యమ ఆత్మను స్మరించుకోవడం, ప్రజా సంకల్పాన్ని మరింత దృఢంగా ప్రకటించడం.ఉద్యమం మొదలైన గడ్డ మీదే ఇప్పుడు అభివృద్ధి గమ్యాన్ని పునఃస్పష్టంగా ఉద్ఘాటించే సమయం.హనుమకొండ సభ ద్వారా మరోసారి చరిత్రను స్మరించుకుంటూ, భవిష్యత్తు దిశగా శక్తివంతమైన ప్రజా సంకల్పాన్ని ప్రకటించుకుందాం.లక్షలాది గులాబీ సైనికులతో జై తెలంగాణ నినాదాలతో రేపటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.