|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:47 PM
హయత్‌నగర్ పరిధి కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కిపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. భారీగా మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.