|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:56 PM
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సూచించారు.