|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:57 PM
కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రదాడి అమానుష చర్య అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి పై నిరసనగా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.