|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 03:59 PM
మేడ్చల్ మున్సిపల్ లోని మూడవ వార్డు లో రఘువేంద్ర నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, రోడ్డుపైన మురికి నీరు పారుతుందన్నారు. దాని వలన దుర్వాసన వస్తుందని, పందులు అధిక సంఖ్యలో సంచారం చేస్తున్నాయని ఆరోపించారు. వెంటనే వార్డులోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని కోరారు.