|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 04:05 PM
కాంగ్రెస్ శృతి లేని గతి లేని ప్రభుత్వమయిందని, కాంగ్రెస్ వచ్చాక అన్ని రకాల ఆదాయాలు తగ్గాయని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా తెలిసిందన్నారు. 'కొత్త పథకాలు లేవు, ఉన్న పథకాలు బంద్ అయ్యాయి. స్కాలర్‌షిప్స్ బంద్, బతుకమ్మ చీరెలు బంద్, కేసీఆర్ కిట్టు బంద్. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ అమలు చేయలేదు. అసెంబ్లీలో మాట చెప్పి తప్పిన చరిత్ర రేవంత్ రెడ్డిది' అని విమర్శించారు.