|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 07:59 PM
తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో ఉందని చెప్పారు. అందరిని సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రణాళిక వేసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రతి వాహనానికి గులాబీ జెండాలను కట్టుకుని రావాలన్నారు. ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్ల ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు