|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:03 PM
ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరించాలని అధికారులను మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ సూచించారు. శనివారం డివిజన్ పరిధిలోని అలీ పార్స్ క్రాస్ రోడ్ వద్ద వాటర్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. స్థానికుల పిర్యాదు మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు అవసరం ఉన్నత మేరకు మంచి నీటి సరఫరా చేయాలన్నారు.