|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:10 PM
తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. రూ.20 వేల కోట్లతో 25 లక్షలకుపైగా రైతులకు రుణమాఫీ చేశామని వివరించారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు పంట పెట్టుబడి సహాయం, భూమి లేని వ్యవసాయ కార్మికుల కుటుంబానికిరూ.12 వేల మద్దతుని ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుపై రూ.500 అదనపు బోనస్ అందిస్తున్నామన్నారు.