|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:11 PM
భూభారతి చట్టం రైతులకీ చుట్టమని,పేదల పాలిట గొప్ప వరమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు హాజరయ్యారు.వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు.ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని రైతులు,పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు.ధరణి అన్నదమ్ములు,కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు.ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు.భూ భారతి చట్టం రైతుల చుట్టం,భూ వివాదల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అన్నారు.ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదారని చెప్పారు.భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ,భూధాన్,అసైన్డ్,దేవాదాయ,భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLA కి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చమని,ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమ్ముదైతే ఎమ్మార్వో,ఆర్డీవో,జేసీ,కలెక్టర్కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చన్నారు.ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోని అందుతాయన్నారు.రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు తెలిపారు.