|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 11:36 AM
పోలీసు శాఖలో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో పలు ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణలు జరగగా.. వీటిని కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.