|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 04:09 PM
యాసంగి పంటలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. సోమవారం మేడిపల్లి మండలం కొండాపూర్, కాచారం లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, తహసిల్దార్ వసంత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.