|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:56 PM
ఆర్టీసీ బస్సు ఆపకుండా వెళ్లడంతో ఓ మహిళ 10 కి.మీ చేజ్ చేసి డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. ‘నేను రోజూ ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు ఎక్కుతాను. ఇవాళ నా పిల్లలు ఎక్కకుండానే బస్సు తీసేశారు. నేను చెప్తున్నా బస్సు ఆపలేదు. పిల్లల కోసం నేను బస్సు దిగే సమయంలో చక్రాల కింద పడాల్సింది. ప్రమాదం తప్పింది. నాకేమైనా అయితే పిల్లలకు దిక్కు ఎవరు’ అని ఆమె ప్రశ్నించింది.దిగేవాళ్లు దిగుతుండగానే కొందరు బస్సు ఎక్కారని, తాను కూడా బస్సు ఎక్కాను. తన పిల్లలు ఎక్కుతుండగా బస్సు వెళ్లిపోయిందని ఆరోపించారు. తన పిల్లలు ఎక్కలేదని చెప్పినా ఆపకుండా బస్సు కదిలిందని దాంతో నేను తన పిల్లల కోసం దిగే క్రమంలో బస్సు నుంచి కింద పడితే తననే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై కండక్టర్ మాట్లాడుతూ బస్సు కదిరిన తర్వాత ఆమె కిందకు దిగే ప్రయత్నం చేసిందని అదృష్టం బాగుండటం వల్ల బస్సు చక్రాల కింద పడలేదని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.