|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:47 PM
నాగర్ కర్నూల్, మే 03, 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా కేవలం 15 రోజుల్లో పూర్తవుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సంగప్ప మరియు వీఐపీ ఆల్ఫామ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లికార్జున్ తెలిపారు.
శనివారం కోడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇళ్ళ మోడల్ హౌస్ నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఆధునిక టెక్నాలజీతో నిర్మాణ వేగం పెరిగి, తక్కువ సమయంలో నాణ్యమైన ఇళ్ళను అందించడం సాధ్యమవుతుందని వెల్లడించారు.