|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:51 PM
రోడ్డు ప్రమాదంలో మరణించిన బంజారా విద్యార్థినుల కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. మలేషియాలో చిక్కుకున్న విద్యార్ధినుల తండ్రికి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
మలేసియాలోని భారత దౌత్యాధికారులతో సమన్వయం చేసి టిక్కెట్ల సహా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మల్(D) లోతేర తండాకు చెందిన అక్కచెల్లెలు బాణావత్ మంజుల, అశ్వినీలు శుక్రవారం చనిపోయిన విషయం తెలిసిందే.